
జమ్మికుంట: జమ్మికుంట గ్రామానికి చెందిన రేవెల్లి దేవిక అలియాస్ రాణి (28) అదృశ్యమైనట్లు ఆమె భర్త రేవెల్లి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 6న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుపతి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దేవిక ఇంట్లోని అల్మారా నుంచి రూ.2,000 నగదు, మూడు తులాల వెండి, దుస్తులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నిద్రలేచి చూసేసరికి భార్య ఇంట్లో కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేవిక ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
