హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టు కీలక తీర్పు
భూయజమానుల హక్కులను కాదనలేరు.. చట్టబద్ధ ప్రక్రియ తప్పనిసరి

హైదరాబాద్: రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రైవేట్ భూములను స్వాధీనం చేసుకునే విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ పేరుతో భూయజమానులను వారి ఆస్తుల నుంచి తొలగించే ముందు చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
నోటీసు.. సర్వే.. పరిహారం తప్పనిసరి
భూములను స్వాధీనం చేసుకునే ముందు సంబంధిత యజమానులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం స్థలాలను సర్వే చేసి, మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిధిలోకి వచ్చే భూమిని ఖచ్చితంగా గుర్తించాలని సూచించింది.
భూయజమానులు పరిహారానికి అర్హులుగా తేలితే.. సంబంధిత చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని HMDA, GHMC అధికారులను ఆదేశించింది.
సుప్రీంకోర్టు కేసులపై స్పష్టత తర్వాతే చర్యలు
సదరు లేఅవుట్‌కు సంబంధించి కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వివాదాల స్వభావంపై చట్టపరమైన సలహాలు తీసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని HMDA, GHMCలను ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది. మాస్టర్ ప్లాన్ ఉన్నప్పటికీ, భూయజమానుల చట్టబద్ధ హక్కులను పక్కనపెట్టి నేరుగా భూములను స్వాధీనం చేసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
