బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

ఇల్లందకుంట, ఆగస్టు 27 (జిందగీ9న్యూస్): ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ శివారులో ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేకల ప్రభాకర్ (40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన ప్రభాకర్ ఆగస్టు 14న రాత్రి బైక్పై వెళ్తుండగా కనగర్తి శివారులో ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో తొలుత జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారని మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
