కరీంనగర్ భారీ చోరీ కేసులో కీలక ఆధారాలు.. పాపయ్యపల్లి వద్ద రెండు బైకులు స్వాధీనం

కరీంనగర్, జూలై 22 (Zindagi9News): కరీంనగర్ పట్టణంలోని భగత్‌నగర్‌లో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. గత రాత్రి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు సుమారు 60 తులాల బంగారం, రూ.21 లక్షల నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను అపహరించిన విషయం తెలిసిందే.
దర్యాప్తులో భాగంగా హుజూరాబాద్ మండలం పాపయ్యపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువ సమీపంలోని చెట్ల పొదల్లో దుండగులు వదిలేసిన రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
