
జమ్మికుంట, ఏప్రిల్ 8(Zindagi9News): కేవలం చిన్నపాటి మాటపట్టింపు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కోరపల్లి రోడ్డులో నివాసముంటున్న పూజకుమారి (26) అనే మహిళ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..
బీహార్‌కు చెందిన రాహుల్ కుమార్ జమ్మికుంటలోని ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి “రోటీలు చల్లగా ఉన్నాయి, వేడిగా ఎందుకు చేయలేదు” అని రాహుల్ తన భార్యను అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన పూజకుమారి, బుధవారం భర్త పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. వీరికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త రాహుల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
