ISSF వరల్డ్ కప్ 2025లో ఈషా సింగ్‌కు రజతం
తెలంగాణ షూటర్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) వరల్డ్ కప్ 2025 పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ ప్రతిభ కనబరచింది. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో రజత పతకం సాధించి తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచింది.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈషా సింగ్ ను అభినందించారు. “మహిళల షూటింగ్ ఈవెంట్లో పతకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణం,” అంటూ పేర్కొన్నారు. క్రీడల్లో మహిళలు సత్తా చాటడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అంతకుమించిన విజయాలు సాధించాలనే ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు.
