కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందించే అదనపు ఆర్థిక సాయాన్ని కొనసాగించేందుకు న్యాయస్థానం అనుమతించింది.
పథకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను హైకోర్టు కొంతవరకు సవరించింది. దీంతో అర్హులైన దివ్యాంగ వధువులకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు మార్గం సుగమమైంది.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంది.
హైకోర్టు తాజా ఆదేశాలతో దివ్యాంగ లబ్ధిదారులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
