SIRలో మీ పేరు ఉందా?.. 1950కు SMS పంపితే చాలు
1950కు SMS పంపి ఓటరు నమోదు వివరాలు తెలుసుకోండి

హైదరాబాద్, జూలై 21 (Zindagi9News): ఓటరు జాబితాలో తమ పేరు నమోదైందో లేదో తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం సులభమైన ఎస్ఎంఎస్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు తమ మొబైల్ ఫోన్లో మెసేజ్ బాక్స్‌లో ECI <స్పేస్> EPIC నంబర్ టైప్ చేసి 1950 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే, వారి ఓటరు నమోదు వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి.
ఎస్ఎంఎస్ పంపిన తర్వాత కూడా వివరాలు అందకపోయినా లేదా ఏవైనా సందేహాలు ఉన్నా సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్లు తమ నమోదు వివరాలను ముందుగానే పరిశీలించి అవసరమైన మార్పులు, సవరణలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
