పరీక్ష లేకుండా IOCLలో 1,450 అప్రెంటిస్ పోస్టులు

న్యూఢిల్లీ, జూలై 15 (జిందగి9న్యూస్): ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పానిపట్ రిఫైనరీలో 1,450 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడతారు. దరఖాస్తు ఫీజు లేదు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 12, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐఓసీఎల్ సూచించింది.
దరఖాస్తు వెబ్సైట్: https://iocl.com/apprenticeships?utm
