లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఈఈ, ఏఈ
రూ.60 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

ఆదిలాబాద్, జూలై 16 (Zindagi9News): ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రూపావతి రమేష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు గురువారం చిక్కారు. సోనాల్ గ్రామంలోని వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ ఫారం నిర్మాణానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేయడానికి రూ.60 వేల లంచం డిమాండ్ చేసి, ఏఈ ద్వారా స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏఈ వద్ద నుంచి రూ.60 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. విధులను దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందేందుకు ఇద్దరు అధికారులు ప్రయత్నించినట్లు పేర్కొంది. నిందితులను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
