ఇంటర్ రెండో విడత అడ్మిషన్లు.. జూలై 31 వరకు గడువు
టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్ల కేటాయింపు

హైదరాబాద్, జూలై 1(Zindagi9news): తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల రెండో విడత షెడ్యూల్ను విడుదల చేసింది. విద్యార్థులు జూలై 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష ప్రకటన విడుదల చేశారు. తొలి విడత అడ్మిషన్లు జూన్ 30తో ముగియడంతో ప్రవేశాల గడువును మరో నెల రోజుల పాటు పొడిగించినట్లు తెలిపారు. అన్ని జూనియర్ కళాశాలలు నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, పదో తరగతి జీపీఏ ఆధారంగానే సీట్లను కేటాయించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
