రక్షిత అడవి కోడి వేటాడితే మూడేళ్ల జైలు.. అటవీశాఖ హెచ్చరిక

వన్యప్రాణి రక్షణ చట్టం కింద రక్షిత జాబితాలో ఉన్న గ్రే జంగిల్ ఫౌల్ (అడవి కోడి) వేటాడితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అరుదైన అడవి కోడి వేట, అక్రమ రవాణా లేదా హాని కలిగించినట్లయితే జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అటవీశాఖ సమాచారం ప్రకారం అడవుల్లో మాత్రమే ఈ గ్రే జంగిల్ ఫౌల్ ప్రధానంగా కనిపిస్తుంది. అడవుల పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషించే ఈ పక్షులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సూచించారు.అడవుల్లో వేటకు పాల్పడకుండా, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
