మూడు టెంకలతో అరుదైన మామిడిపండు.. నాగర్కర్నూల్లో ఆసక్తికర ఘటన

నాగర్కర్నూల్ జిల్లా కుప్పగండ్ల గ్రామంలో అరుదైన విరూప మామిడిపండు కాయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఒకే టెంక ఉండే మామిడిపండులో ఈసారి మూడు టెంకలు కనిపించడంతో రైతులు, గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై స్పందించిన ఉద్యానశాఖ అధికారిణి ప్రకారం, పరాగ సంపర్కం సరిగా జరగకపోవడం, అలాగే బోరాన్-జింక్ వంటి సూక్ష్మ పోషకాల కొరత కారణంగా ఇలాంటి విరూప పండ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. వంద మామిడికాయల్లో కేవలం 1 శాతం మాత్రమే ఇలాంటి అరుదైన కాయలు కనిపిస్తాయని వెల్లడించారు.ఈ విభిన్న ఆకారంలోని మామిడిపండును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
