నీట్-2026లో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం.. 19 మందికి 500కు పైగా మార్కులు
డాక్టర్స్-30 ప్రత్యేక ప్రోగ్రామ్ ఫలితం.. సుమారు 100 మందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం

కరీంనగర్, జూలై 17 (Zindagi9News): నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరోసారి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాయని సంస్థ చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణ, సమర్థవంతమైన శిక్షణతో విద్యార్థులు జాతీయ స్థాయిలో విశిష్ట మార్కులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని పేర్కొన్నారు.
ఈ ఫలితాల్లో డి. రిత్విక్ 647 మార్కులతో అత్యధిక స్కోర్ సాధించగా, సిద్ధాంత్ చతుర్వేది 564, సయ్యద్ మలాజుద్దీన్ 557, వసుల శ్రుత్విక 551, గులామ్ మహమ్మద్ హుస్సేన్ 548, బత్తుల అభిజ్ఞ 541, లింగంపల్లి అనంత్ సాయి 540, నార్ల శ్రీహిత 538, శ్రేయాంశ్ ద్వివేది 537, కొండ్ల అక్షిత 522, బొమ్మవరపు రుత్విక్ 515, జక్కుల శ్రీవైత్రి 512, టి. హర్షిత 509, సిద్ధం సాత్విక 508, ఎ. సత్య బ్రాహ్మిణి 507, బి. అక్షర 505, నిదా 502, గుంజేటి రిషిత 501, జహ్రా మాజీద్ 501 మార్కులు సాధించారు.

అల్ఫోర్స్ నిర్వహిస్తున్న DOCTORS-30 ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, ఈ ఏడాది 19 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమని డా. నరేందర్ రెడ్డి తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశముందని పేర్కొన్నారు.
పటిష్ఠమైన విద్యా ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, అధ్యాపక బృందం కృషి, విద్యార్థుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. నీట్, ఐఐటీ, ఎన్ఐటీల్లో అత్యధిక మంది విద్యార్థులు సీట్లు సాధించేలా భవిష్యత్తులో మరింత మెరుగైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
