హరీష్ రావు ప్రజాసహాయ నిధికి రూ.6 లక్షల విరాళం.. తొలి నెల జీతంలో సగం అందజేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

సిద్ధిపేట, జూలై 11 (జిందగి9న్యూస్): సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్ మాజీ మంత్రి టి. హరీష్ రావు ప్రజాసహాయ నిధికి రూ.6 లక్షలు విరాళంగా అందజేశారు. నాలుగేళ్ల క్రితం తనకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి చదువుకునే అవకాశం కల్పించిన హరీష్ రావు చేసిన సహాయానికి కృతజ్ఞతగా, తన తొలి నెల జీతంలో సగం మొత్తాన్ని ప్రజాసహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ నిధి ద్వారా తనలాంటి మరికొందరు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందాలని రోహిత్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టి. హరీష్ రావు రోహిత్‌ను, అతని కుటుంబ సభ్యులను అభినందిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
