పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న అన్ని తాత్కాలిక పరిమితులు తొలగిపోనున్నాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో ఇంధన సరఫరా కూడా స్థిరపడిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంధన పంపిణీపై విధించిన నియంత్రణలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇకపై డీజిల్ విక్రయాలపై అమల్లో ఉన్న రోజువారీ 200 లీటర్ల పరిమితి కూడా వర్తించదని స్పష్టం చేశారు. దీంతో వినియోగదారులు, రవాణా రంగానికి ఊరట లభించనుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
