తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతల స్వీకారం

హైదరాబాద్, జూన్ 30 (Zindagi9news): తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.పదవీ విరమణ చేసిన కే. రామకృష్ణా రావు స్థానంలో సంజయ్ జాజు కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహించనున్న ఆయన నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయనున్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
