నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల ముఠా గుట్టురట్టు మీర్‌చౌక్ పోలీసుల వలలో ప్రధాన నిందితుడు.. 15 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం

హైదరాబాద్, జూలై 8 (Zindagi9news): హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీసులు నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల ముఠా గుట్టురట్టు చేసి ప్రధాన నిందితుడు అబ్దుల్ రషీద్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 15 నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు నకిలీ BPT, B.Sc, పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను తయారు చేసి, విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు లేదా వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
