
మాదపూర్ / హైదరాబాద్: ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవరాజుకు ఆర్థికంగా సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నుంచి రూ.60,000/- (అరవై వేలు) మంజూరయ్యాయి.
ఈ చెక్కును ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి ఆదేశాల మేరకు, హైదరాబాద్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితుడికి కార్యాలయ ఇంచార్జి కె.బి. నాయుడు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుడు తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో జిల్లా యువజన నాయకుడు రంజిత్ కుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
