
వీణవంక, జూన్ 10 (జిందగీ 9 న్యూస్. ప్రతినిధి దాట్ల శ్రీనివాస్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అంబటి రజిత మాట్లాడుతూ, “గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి విధానంతో రైతులు అనేక నష్టాలు ఎదుర్కొన్నారు. తాజా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి వ్యవస్థ ద్వారా రైతులకు న్యాయం జరగబోతుంది” అని చెప్పారు.
రైతులు తమ భూసంబంధిత సమస్యలపై నేరుగా ఎమ్మార్వోకు దరఖాస్తులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో సయ్యద్ నిజాముద్దీన్, ఆర్ఐలు రవి, నర్సయ్య, ఏఎస్ఓ రమేష్, జూనియర్ అసిస్టెంట్ విక్రమ్, రికార్డ్ అసిస్టెంట్ రమేష్, నవీన్, కంప్యూటర్ ఆపరేటర్ కజీం పాల్గొన్నారు. కొండపాక గ్రామానికి చెందిన అనేక మంది రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
