రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా చెర్యాల తహసీల్దార్

సిద్దిపేట, జూలై 6 (Zindagi9news): సిద్దిపేట జిల్లా చెర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. నాగపురి గ్రామానికి చెందిన భూములకు సంబంధించి 11 నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి తన కార్యాలయంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించబోమని ఏసీబీ పేర్కొంది. ప్రజా సేవకులు లంచం కోరితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
