48 గంటల్లో కొత్త రేషన్ కార్డు: మంత్రి పొన్నం
361 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ

హైదరాబాద్, జూలై 5(Zindagi9news): అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసిన 48 గంటల్లో కొత్త రేషన్ కార్డు అందజేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, వేగంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
