
ఏసీబీ వలలో బోధన్ టౌన్ ఎస్ఐ.. రూ.7 వేల లంచం తీసుకుంటూ పట్టివేత
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ చిట్టనోజు భాస్కర్ చారి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల వలలో చిక్కారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.7 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ నిజామాబాద్ రేంజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి ఎస్ఐను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా లేదా స్వీకరించినా వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.
