DRDOలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 10 నుంచి B.Tech వరకు అర్హతలు

బాలేశ్వర్: రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలోని Proof & Experimental Establishment (PXE), Chandipurలో 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌లను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 50 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాది పాటు Apprenticeship Training ఇవ్వనున్నారు.
పోస్టుల వివరాలు
Graduate Apprentice (B.Tech) – 15 పోస్టులు
- Electronics & Communication – 4
- Mechanical – 4
- Computer Science – 5
- Chemical – 2
స్టైపెండ్: నెలకు రూ.12,300.
Technician Apprentice (Diploma) – 35 పోస్టులు
- Civil – 10
- Computer Science – 5
- Electronics & Communication – 5
- Mechanical – 8
- Chemical – 1
- Electrical – 2
- Cinematography – 2
- Automobile – 2
స్టైపెండ్: నెలకు రూ.10,900.
అర్హతలు
సంబంధిత విభాగంలో B.E./B.Tech లేదా Diploma పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2022, 2023, 2024, 2025 లేదా 2026లో తమ కోర్సును పూర్తి చేసి ఉండాలి. సంబంధిత కోర్సును Regular Modeలో పూర్తి చేసిన వారినే పరిగణనలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు National Apprenticeship Training Scheme (NATS) పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. NATS Enrollment Number లేకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు.
అదేవిధంగా, సంబంధిత విద్యార్హత పూర్తయ్యాక ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ/ట్రైనింగ్ అనుభవం ఉన్నవారు ఈ ఎంపికకు అర్హులు కాదు. Post-Graduation చేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరు.
ఎంపిక విధానం
అభ్యర్థుల విద్యార్హతలో సాధించిన మార్కుల శాతాన్ని ఆధారంగా చేసుకుని ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు PXE, Chandipurలో Written Test/Interview నిర్వహిస్తారు. ఎంపికైన వారికి Offer/Joining Letterను ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
అభ్యర్థులు DRDO వెబ్సైట్ (https://drdo.gov.in/drdo/en )నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకుని టైప్ చేసి పూర్తి చేయాలి. చేతితో రాసిన అప్లికేషన్లను తిరస్కరిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తును Speed Post/Registered Post ద్వారా Director, Proof & Experimental Establishment (PXE), Chandipur, Balasore, Odisha-756025 చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 12 అక్టోబర్ 2026.
ముఖ్య గమనిక
ఇది ఒక సంవత్సరం Apprenticeship Training మాత్రమే. అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత DRDOలో ఉద్యోగం పొందే హక్కు ఉండదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి వసతి, రవాణా సౌకర్యాలు కూడా కల్పించరు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
