
సుజాతానగర్, అక్టోబర్ 7 (Zindagi9news): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని బుధవారం సుజాతానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వాహనదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై వాహనదారులకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపారు.అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, ఓటీపీ, ఏటీఎం/బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఏఎస్ఐ రాఘవులు, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, పీసీలు నాగరాజు, పృథ్వీరాజ్, సీతారాం తదితర పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
