పెద్దపల్లిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులకు నోటిఫికేషన్.. త్వరలో మిగతా జిల్లాల్లోనూ విడుదల

పెద్దపల్లి, జూన్ 29(Zindagi9news): తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా (హెల్పర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. దరఖాస్తులను జూలై 6, 2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.
అభ్యర్థులు https://wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, రోస్టర్, అవసరమైన ధ్రువపత్రాల వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పొందుపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దపల్లితో పాటు మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాల్లో మాత్రమే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, మిగతా జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా త్వరలో దశలవారీగా అంగన్వాడీ నియామక నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని, అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ పోస్టుల భర్తీని దశలవారీగా పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
