న్యాయవాదుల సంక్షేమ డిమాండ్లపై ఐలు ఆధ్వర్యంలో ధర్నా

కొత్తగూడెం, సెప్టెంబర్ 23(Zindagi9news): న్యాయవాదుల డెత్/రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.25 లక్షలకు పెంచాలని, న్యాయవాదులందరికీ వైద్య సహాయం కింద రూ.5 లక్షలు అందించాలని, జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల పాటు నెలకు రూ.10 వేల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఐలు జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఐలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు పురుషోత్తమరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐలు అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారికి మరణానంతరం లభించే ప్రయోజనాలతో పోలిస్తే న్యాయవాదులకు ప్రస్తుతం అందుతున్న రూ.10 లక్షల సహాయం సరిపోదన్నారు. డెత్/రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేయడం సమంజసమన్నారు.
అదేవిధంగా న్యాయవాదులకు ప్రస్తుతం అందుతున్న రూ.2 లక్షల ఆరోగ్య బీమా తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సరిపోవడం లేదని, దానిని రూ.5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా వృత్తిలోకి వచ్చే జూనియర్ న్యాయవాదులకు ప్రారంభ దశలో కేసులు రావడం కష్టంగా ఉంటుందని, రోజువారీ ఖర్చులను భరించేందుకు వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్‌ను ఐదేళ్ల పాటు అందించాలని కోరారు.
ఈ మూడు డిమాండ్లను అమలు చేసేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐలు జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని కొల్లి సత్యనారాయణ తెలిపారు.
ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యులు జలసూత్రం శివరాం ప్రసాద్, ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్ న్యాయవాదుల డిమాండ్లపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఐలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.వి. ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు పి. కిషన్ రావు, కె. పుల్లయ్య, ఆర్. రామారావు, బి. అరుణ్ చంద్, జి.కె. అన్నపూర్ణ, ఎస్. వెంకట నర్సయ్య, టి. రమేష్, యు. అరుణ్, ఏ. రవి కుమార్, డి. రవి కుమార్, పి. రామారావు, పి. రవి వర్మ, పగిడిపల్లి రవి, కె. అభిలాష్, ఎస్. రామారావు, బి. రమేష్, లీలావతి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు కోర్టు కమిటీ అధ్యక్షులు పి. భాస్కర్‌తో పాటు ఎం. శ్రీనివాసరావు, పి. నగేష్ కుమార్, జే. చొక్కారావు, ఈ. రాము పాల్గొన్నారు. భద్రాచలం కోర్టు కమిటీ సభ్యులు కె. శ్రీనివాసరావు, ఏ. అంజలి కుమారి, యు. గౌతమ్ కుమార్, ఇల్లందు కోర్టు కమిటీ సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు.
కొత్తగూడెం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ ముదుల్కర్, ప్రధాన కార్యదర్శి జి. మహేశ్వరరావు ఐలు డిమాండ్లపై ప్రసంగించి మద్దతు తెలిపారు. సీనియర్ న్యాయవాదులు ఎల్. సత్యనారాయణ, వి. నాగిరెడ్డి, జి. రామమూర్తి, కె. నాగేశ్వరరావు, ఎం. ఉషారాణి కూడా డిమాండ్లకు మద్దతు తెలిపారు.
అలాగే ఐఏఎల్ బాధ్యులు వై. ఉదయ్ భాస్కర్, భాగం మాధవరావు, న్యాయవాద పరిషత్ బాధ్యులు పి.ఆర్. విఠల్, బీజేపీ లీగల్ కౌన్సిల్ కాసాని రమేష్ తదితరులు ప్రసంగించి ఐలు డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్‌కు చెందిన సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
