ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రేపు కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

హైదరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులు ఉన్నత విద్యలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ ఆరోపించింది. బకాయిలు చెల్లించేవరకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని కొన్ని కళాశాలలు చెబుతున్నాయని పేర్కొంది.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది.
