తెలంగాణ టెట్-2026 ఫలితాలు విడుదల.. 43.94 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది టెట్లో 43.94 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను అధికారిక వెబ్సైట్లైన “TG TET పోర్టల్”
https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx?
వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
