
నిజామాబాద్ రూరల్ (సిరికొండ), అక్టోబర్ 15 (జిందగీ 9 న్యూస్): సిరికొండ మండల పరిధిలోని పెద్ద వాల్గోట్ గ్రామంలో అంజి గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనతో పాటు హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదపండితులు కులకర్ణి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించి, హోమగుండంలో హవిస్సులు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు, గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజి గణేష్ మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
