
జమ్మికుంట, అక్టోబర్ 19 (జిందగీ 9 న్యూస్): అప్పు డబ్బుల వివాదం నేపథ్యంలో ఇద్దరిపై దాడి జరిగిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జమ్మికుంట పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వీణవంక మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన చిన్నాల రమేష్ (34) అదే గ్రామానికి చెందిన ఎట్టపు మహేష్ వద్ద వ్యక్తిగత అవసరాల నిమిత్తం సుమారు ఏడాది క్రితం రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు తిరిగి చెల్లించే విషయంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న రమేష్, మహేష్‌పై దాడి చేసినట్లు, అక్టోబర్ 17న సాయంత్రం మహేష్ మొబైల్ షాప్ వద్ద పనిచేస్తున్న సాయికుమార్‌పై కూడా దాడి జరిగినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో మహేష్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, రమేష్, అతని తమ్ముడు చిన్నాల అనిల్ (30), బైరాం సిద్ధార్థ్ (22), వేల్పుల వినయ్ (19) తదితరులు కలిసి జమ్మికుంట బస్టాండ్ సమీపంలో మహేష్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహేష్‌ను రక్షించేందుకు వచ్చిన అతని బావమరిది మాకోటి శ్రీకాంత్‌పై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శ్రీకాంత్ పొట్ట భాగంలో బటన్ కత్తితో గాయపరచడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, మహేష్ తల, వీపు, కిడ్నీ ప్రాంతాల్లో గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
