అప్పు డబ్బుల వివాదం.. యువకుడిపై బటన్ కత్తితో దాడి.. ఐదుగురు అరెస్ట్

జమ్మికుంట, అక్టోబర్ 19 (జిందగీ 9 న్యూస్): అప్పు డబ్బుల వివాదం నేపథ్యంలో యువకుడిపై బటన్ కత్తితో దాడి చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను జమ్మికుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి బటన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంట పోలీసుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన ఎట్టపు మహేష్ (34) గత ఏడేళ్లుగా జమ్మికుంట బస్టాండ్ సమీపంలో రిషి మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. సుమారు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన చిన్నాల రమేష్ వద్ద రూ.5 లక్షలు వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లించాలని రమేష్ పలుమార్లు అడిగినప్పటికీ చెల్లించకపోవడంతో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో అక్టోబర్ 17న సాయంత్రం జమ్మికుంట బస్టాండ్ సమీపంలోని మొబైల్ షాప్ వద్ద చిన్నాల రమేష్, ఎట్టపు మహేష్ మధ్య అప్పు డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రమేష్ తమ్ముడు చిన్నాల అనిల్‌పై ఎట్టపు మహేష్‌తో పాటు మాకోటి శ్రీకాంత్, కోరపల్లి సాయి అలియాస్ నాంపల్లి సాయి కుమార్, పల్లవేన రాజు, నరెంగుల మహేష్ అలియాస్ మహిపాల్ కలిసి దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో బటన్ కత్తితో అనిల్ మెడపై బలమైన గాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి బటన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు జమ్మికుంట పోలీసులు హెచ్చరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
