వాట్సాప్‌లో వచ్చే గుర్తుతెలియని మెసేజ్‌లతో జాగ్రత్త.. సైబర్ మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలి

నిజామాబాద్ రూరల్ (సిరికొండ), అక్టోబర్ 13 (జిందగీ 9 న్యూస్): సైబర్ నేరాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరికొండ ఎస్సై రామకృష్ణ సూచించారు. ఇటీవల వాట్సాప్‌లో “మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయి” అంటూ వచ్చే మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ తరహా మెసేజ్‌లలో “మీరు ఎలాంటి లావాదేవీ చేయకపోతే NO అని రిప్లై ఇవ్వండి” అంటూ ఉండే సూచనలను నమ్మి స్పందించవద్దని తెలిపారు. బ్యాంకు లావాదేవీలపై ఏదైనా అనుమానం ఉంటే వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయకుండా, సంబంధిత బ్యాంకు అధికారిక యాప్ లేదా అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్సై రామకృష్ణ కోరారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పిన్ నంబర్లను గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని, అనుమానాస్పద సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
