
నిజామాబాద్ రూరల్( సిరికొండ), అక్టోబర్ 13 (జిందగీ 9 న్యూస్): సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అధికారులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలను ఆపి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు లారీలకు రేడియం స్టిక్కర్లు ఉన్నాయా లేదా అనే అంశంపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలు, రవాణా శాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
