
హైదరాబాద్/అమరావతి: ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్ల మొదటి మెరిట్ లిస్టులు విడుదలయ్యాయి. GDS Online Engagement Schedule-II, July-2026లో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ జాబితాలను విడుదల చేసింది. మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్లు, పోస్టుల వివరాలు, కేటగిరీలు, మార్కుల శాతాన్ని పొందుపరిచారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ GDS రిజల్ట్స్ PDFలు
తెలంగాణ సర్కిల్ మెరిట్ లిస్ట్ కోసం Telangana GDS Results 2026 PDF డౌన్లోడ్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మెరిట్ లిస్ట్ కోసం Andhra Pradesh GDS Results 2026 PDF డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: India Post GDS Online Engagement.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మెరిట్ లిస్టులో పేరు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 27వ తేదీలోపు సంబంధిత డివిజనల్ కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు వాటి రెండు సెట్ల ఫొటోకాపీలను సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
