
జమ్మికుంట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ సిమెంట్ శిలాఫలకం ప్రమాదకరంగా ఒరిగిపోయింది. రోడ్డుపైకి వాలినట్లుగా ఉన్న ఈ శిలాఫలకం ఎప్పుడు కూలిపడుతుందోనని అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోగులు, అంబులెన్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మలుపు వద్దే శిలాఫలకం ఒరిగి ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో దీనిని గుర్తించడం కష్టమైతే ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది.భారీ శిలాఫలకం కూలిపడితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూడకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్థలాన్ని పరిశీలించి, శిలాఫలకాన్ని తొలగించడమో లేదా పటిష్టంగా సరిచేయడమో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
