రమ్మీ గేమింగ్ సంస్థలపై ఈడీ చర్యలు.. రూ.442.35 కోట్ల ఆస్తులు అటాచ్

బెంగళూరు: ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. RummyCulture యాప్ తదితర ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన రూ.442.35 కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. Gameskraft Technologies Pvt. Ltd., RummyTime Technologies Pvt. Ltd. సంస్థలు RummyCulture, RummyPrime, Playship, RummyTime తదితర బ్రాండ్ల పేర్లతో ఆన్లైన్ రమ్మీ గేమ్స్, టోర్నమెంట్లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సుమారు 3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు ఈడీ పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ అక్కడ కూడా గణనీయ సంఖ్యలో యూజర్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. యూజర్లు పెట్టిన మొత్తాలపై 10 నుంచి 15 శాతం వరకు ప్లాట్‌ఫారమ్ కమిషన్ వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది.
అలాగే, యూజర్లకు తెలియకుండా BOTs (ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్/అల్గారిథమ్స్) ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. వీటి కారణంగా కొంతమంది యూజర్లకు ఆర్థిక నష్టం జరిగినట్లు, సంస్థలకు నేరం ద్వారా ఆదాయం సమకూరినట్లు పేర్కొంది.
కొత్త యూజర్లను ఆకర్షించేందుకు బోనస్‌లు, రిఫరల్ ఇన్సెంటివ్‌లు, ఉచిత టోర్నమెంట్ ఎంట్రీలు, ప్రమోషనల్ రివార్డులు వంటి పద్ధతులను ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాల కోసం సుమారు రూ.1,035 కోట్లు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో విత్‌డ్రాయల్‌పై 5 నుంచి 10 శాతం వరకు లెవీ విధించినట్లు కూడా తెలిపింది.
గతంలో నిర్వహించిన సోదాల్లో రూ.495 కోట్ల విలువైన చర ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. అదనంగా రూ.11 లక్షల నగదు, సుమారు 2.30 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గతంలో సుమారు రూ.1,906 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు పేర్కొంది.
తాజా రూ.442.35 కోట్ల అటాచ్‌మెంట్‌తో కలిపి, ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు అటాచ్, ఫ్రీజ్, సీజ్ చేసిన నేరపూరిత ఆదాయానికి సంబంధించిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.2,843 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది.
కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
