మహిళలే ముందుండి.. గణపతి ఉత్సవాలు
జమ్మికుంటలో శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, దుర్గ కాలనీలో శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతి కార్యక్రమంలో మహిళలే ముందుండి బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన, నిత్య పూజా కార్యక్రమాలు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వహణతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మహిళలు సమిష్టిగా సమన్వయం చేస్తున్నారు. భక్తి, ఐక్యత, సేవాభావంతో మహిళలంతా కలిసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు స్వయంగా అన్నప్రసాదాన్ని భక్తులు, కాలనీ వాసులకు వడ్డించారు. మొదటి రోజు నుంచి ఉత్సవాల నిర్వహణలో మహిళలు చూపుతున్న చొరవ, అంకితభావం, సమన్వయం స్థానికంగా ప్రత్యేకంగా నిలుస్తోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
