SBI ఖాతాదారులకు అలర్ట్.. 4 సార్లు దాటితే నగదు విత్‌డ్రాపై ఛార్జీ
SBI ఖాతాదారులకు కీలక అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి నగదు ఉపసంహరణపై ఛార్జీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20(Zindagi9news): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. బ్రాంచ్ ద్వారా నిర్వహించే BSBD ఖాతాల్లో నగదు ఉపసంహరణ ఛార్జీలను 2026 అక్టోబర్ 1 నుంచి సవరించనున్నట్లు SBI తెలిపింది.
నెలలో నాలుగు నగదు ఉపసంహరణలు ఉచితంగా కొనసాగుతాయని బ్యాంకు స్పష్టం చేసింది. నాలుగు లావాదేవీలకు మించి చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ.15 + GST ఛార్జీ విధించనున్నారు.
అయితే డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి పరిమితి ఉండదని, అవి కొనసాగుతూనే ఉచితంగా ఉంటాయని SBI పేర్కొంది. ఖాతాదారులు ఈ మార్పులను గమనించాలని సూచించింది.
