సోషల్ మీడియా రీల్ నమ్మి దారుణం.. రూ.6 కోట్ల ఆశతో బాలుడి హత్య

భోపాల్, ఆగస్టు 18 (Zindagi9news): సోషల్ మీడియాలో వైరల్ అయిన తప్పుడు సమాచారాన్ని నమ్మిన ఓ బీబీఏ విద్యార్థి, తన గ్యాంగ్‌తో కలిసి 16 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగుచూసింది.
మానవ వృషణాలకు రూ.6 కోట్లు వస్తాయని సోషల్ మీడియాలో చూసిన రీల్‌ను నిజమని నమ్మిన నిందితుడు, డబ్బు సంపాదించాలనే ఆశతో బాలుడిని మాయమాటలతో తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతుడి శరీరం నుంచి భాగాలను తొలగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అయితే వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాము నమ్మిన ప్రచారం తప్పుడు సమాచారమని నిందితులకు తెలిసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన భోపాల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, వాస్తవాలను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
