భర్త చెవిలో విషం పోసిన భార్య.. హత్యాయత్నం భగ్నం రుణభారం నుంచి బయటపడేందుకే కుట్ర.. భార్య, బావ అరెస్ట్

తంజావూరు, జూలై 5 (Zindagi9news): రుణభారం నుంచి బయటపడేందుకు భర్తను హత్య చేయాలని కుట్ర పన్నిన భార్య, తన సోదరుడితో కలిసి నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కలకలం రేపింది. పుళుదికుడికి చెందిన కూలీ రవిచంద్రన్ (54), భార్య ఉమారాణి (48)తో కలిసి నివసిస్తున్నాడు. కొత్త ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రూ.10 లక్షల రుణం చెల్లించలేకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో భర్త చనిపోతే రుణభారం నుంచి విముక్తి లభిస్తుందని భావించిన ఉమారాణి, తన సోదరుడు జ్ఞానశేఖరన్తో కలిసి మంగళవారం రాత్రి నిద్రిస్తున్న రవిచంద్రన్ చెవిలో విషం పోసినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా మేల్కొన్న రవిచంద్రన్ వారి నుంచి తప్పించుకుని స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉమారాణి, జ్ఞానశేఖరన్ను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో మూడు నెలల క్రితమే టీలో విషం కలిపి రవిచంద్రన్ను చంపేందుకు ప్రయత్నించినట్లు తేలింది. అప్పటి నుంచి ఇంట్లో ఏమీ తినకుండా జాగ్రత్త పడుతున్న రవిచంద్రన్పై మరోసారి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి తంజావూరు జైలుకు రిమాండ్కు తరలించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
