యూరియా కొరత లేదు.. బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట: మంత్రి తుమ్మల
ఫెర్టిలైజర్ యాప్‌తో 17.70 లక్షల మంది రైతులకు సేవలు

హైదరాబాద్, జూలై 5(Zindagi9news): తెలంగాణలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు విక్రయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఫెర్టిలైజర్ యాప్ ద్వారా 17.70 లక్షల మంది రైతులు 59.78 లక్షల యూరియా బ్యాగులను బుక్ చేసుకున్నారని చెప్పారు. ఈ విధానంతో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు సమర్థంగా అడ్డుకట్ట పడిందన్నారు. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలపై ప్రయోగాలు కూడా చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
