సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ పోస్టులు
డిగ్రీ అర్హతతో యువతకు అవకాశం

న్యూఢిల్లీ, జూన్ 12: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందజేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 12 నుంచి ప్రారంభమై, జూన్ 22, 2026 వరకు కొనసాగనుంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు, రాష్ట్రాల వారీ ఖాళీలు, ఎంపిక విధానం తదితర సమాచారాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://www.centralbank.bank.in లోని Recruitment విభాగంలో తెలుసుకోవచ్చు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
