పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు.. జన్యవుల రామకృష్ణపై బీజేపీ సస్పెన్షన్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ విభాగం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యవుల రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, పార్టీ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడమే ఈ నిర్ణయానికి కారణమని పార్టీ వెల్లడించింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ , జన్యవుల రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సస్పెన్షన్ జూన్ 7, 2026 నుంచి తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే, తన ప్రవర్తనపై వారం రోజుల్లోగా రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఆదేశించింది.
