జూన్ 4, 6, 8, 10 తేదీల్లో జమ్మికుంటలో వార్డ్ సభలు

జమ్మికుంట, జూన్ 3(Zindagi9news): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీలో వార్డ్ సభలను నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి తెలిపారు. ఈ మేరకు చైర్పర్సన్ ఎం. ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో వార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ వార్డ్ సభలను విజయవంతం చేయాలని సూచించారు.
• జూన్ 4: వార్డ్ నంబర్లు 12, 19, 20, 23, 24, 26
• జూన్ 6: వార్డ్ నంబర్లు 1, 4, 6, 10, 28, 29
• జూన్ 8: వార్డ్ నంబర్లు 5, 7, 13, 17, 18, 22, 25, 27, 30
• జూన్ 10: వార్డ్ నంబర్లు 2, 3, 8, 9, 11, 14, 15, 16, 21
వార్డ్ సభల్లో చర్చించనున్న ప్రధాన అంశాలు:
• ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు – 2026
• “జల్ సంచయ్ – జల్ భాగీదారి” కార్యక్రమంలో భాగంగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు
• డ్రైన్ల పూడికతీత, శుభ్రపరిచే పనులు
• రుతుపవనాల సన్నద్ధతకు కార్యాచరణ ప్రణాళిక
• త్రాగునీటి సరఫరా, నిర్వహణ
• నీటి నిల్వల నివారణ, పారిశుధ్య చర్యలు
• రోడ్ల నిర్వహణ
• వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ
• మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు
• ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
ఈ సమావేశంలో మేనేజర్ జి. రాజారెడ్డి, వార్డ్ అధికారులు పాల్గొన్నారు. వార్డులలో ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ వార్డ్ సభలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
