
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచనే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, వ్యవసాయ రంగానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సేవలు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉచిత విద్యుత్ పథకంపై ఎలాంటి ప్రభావం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
