CASO తనిఖీలు: 8 బైకులు, 2 ట్రాక్టర్లు స్వాధీనం

జమ్మికుంట, మే 20 (జిందగీ9న్యూస్): జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో CASO (Cordon and Search Operation) కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్, సైదాపూర్ ఎస్ఐ, ఎస్ఐ యూన్స్, ఎస్ఐ రవి పాల్గొన్నారు.
ఆపరేషన్‌లో భాగంగా వాహనాల పత్రాలను పరిశీలించగా, సరైన పత్రాలు లేని 8 మోటార్‌సైకిళ్లు మరియు 2 ఖాళీ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహన యజమానులపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
