
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అటవీ అధికారులు.. ACB ట్రాప్‌లో ఇద్దరు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అటవీ శాఖ అధికారులు పట్టుబడ్డారు. ACB అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..భద్రాచలం అటవీ విభాగ అధికారి (FDO) సంతపురి సుజాత, తేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (DRO) మరియు ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భూక్యా కృష్ణ లంచం డిమాండ్ చేసిన కేసులో చిక్కుకున్నారు.మొదట రూ.10 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు, అనంతరం దానిని రూ.3.50 లక్షలకు తగ్గించి తీసుకుంటుండగా ACB ఖమ్మం రేంజ్ అధికారులు ట్రాప్ నిర్వహించి పట్టుకున్నారు.లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ACB వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
