
ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగుల మెరుపు సమ్మె
న్యూఢిల్లీ: తమ 16 డిమాండ్ల పరిష్కారం కోసం State Bank of India (ఎస్బీఐ) ఉద్యోగులు ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల మెరుపు సమ్మెకు పిలుపునిచ్చారు.
ఉద్యోగుల సమస్యలు, సిబ్బంది కొరత, పని ఒత్తిడి, వేతనాలు మరియు ఇతర సేవా అంశాలకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పలుమార్లు యాజమాన్యానికి వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.
ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా State Bank of India బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం.
