కాటారం అడవుల్లో వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం వెలుగు

జయశంకర్ భూపాలపల్లి (ప్రతినిధి):
జిల్లాలోని మండల పరిధిలోని చింతకాని గ్రామ శివారు అటవీ ప్రాంతంలో అరుదైన చారిత్రక సంపద వెలుగుచూసింది. అడవి ప్రాంతంలోని ఒక వాగులో సుమారు వెయ్యి సంవత్సరాల నాటి పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నల్లరాతితో అద్భుతమైన శిల్పకళతో చెక్కిన ఈ విగ్రహాన్ని గ్రామస్థులు గుర్తించారు. విగ్రహ రూపాన్ని బట్టి ఇది శ్రీకృష్ణుడు, గోవింద, చెన్నకేశవ లేదా విష్ణుమూర్తి రూపాల్లో ఒకటిగా భావిస్తున్నారు. శిల్పకళా లక్షణాలను పరిశీలించిన చరిత్రాభిమానులు, ఇది కాలానికి చెందినదై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు విగ్రహాన్ని దర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. పురాతత్వ శాఖ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి పరిశోధన జరిపి, ఈ చారిత్రక సంపదను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
